మరి సమైక్యంద్ర కు ఏకాబిప్రాయం ఉందా?

మన దేశ ప్రబుత్వం మరియు రాష్ట్ర ప్రబుత్వాలు(andra support) ఎంత సేపు తెలంగాణాలో ఎన్ని ఆత్మహత్యలు జరిగిన, ఉద్యమాలు జరిగిన, హింసకు, దోపిడికి గురైనా కూడా ఏకాబిప్రాయం కుదరడం లేదు తెలంగాణకు అని చెబుతుంది.

OK, వీళ్ళు అన్నది కరెక్టే ఏకాబిప్రాయం లేదు అంటే ఆంద్ర సీమ నాయకులూ ఒప్పుకోవడం లేదు కాబట్టి ఏకాబిప్రాయం లేదు తెలంగాణకు, కాబట్టి తెలంగాణా కష్టం అంటున్నారు.

కాని చట్ట పరంగా, న్యాయ పరంగా మనం ఎప్పుడైనా నాణానికి రెండు వైపులా ఆలోచించాలి. అప్పుడే అదీ న్యాయం అవుతుంది.

అలా చూస్తె తెలంగాణకు ఏకాబిప్రాయం అని అంటున్న నాయకులూ, అసలు సమైక్యంద్ర నినాదానికి కూడా ఏకాబిప్రాయం కచ్చితంగా ఉండాలి అని ఎందుకు ఆలోచించటం లేదు.

మరి సమైక్యంద్ర కు ఏకాబిప్రాయం ఉందా?

తెలంగాణాలో ఉన్న వారు సమైక్యంద్ర కు వ్యతిరేకిస్తున్నారు. అంటే సమైక్యంద్ర నినాదానికి ఏకాబిప్రాయం లేదు, మరి సమైక్యంద్ర ఎందుకు ఉండాలి,

ఏకాబిప్రాయం లేదని తెలంగాణాను అడ్డుకున్నప్పుడు, ఏకాబిప్రాయం లేని సమైక్యంద్ర కూడా అడ్డుకోవాలి.

కమిటి లు , సదస్సు లు, చర్చలు కేవలం తెలంగాణా మీదనే ఎందుకు చెయ్యాలి, సమైక్యంద్ర మీద కూడా చేసి, సమైక్యంద్ర కావాలని తెలంగాణా వాళ్ళు అంటే అప్పుడు సమైక్యంగా ఉండాలి.

తెలంగాణా సమైక్యంద్ర రెండింటిలో ఏకాబిప్రాయం లేదు అంటే రెండు ప్రాంతాలు విడిపోయాయి అని అర్ధం అయినప్పుడు , ఇంకా తెలంగాణా ఇవ్వడానికి అడ్డేమిటి?

తెలంగాణా నాయకులారా తెలంగాణకు ఏకాబిప్రాయం అని ఆంద్ర వాళ్ళు అంటున్నారు, మీరు కూడా సమైక్యంద్రకు ఏకాబిప్రాయం అడగండి.

జై తెలంగాణా
By Sathish Kotha

You might be interested in :