ఇక చాలు. వెళ్ళవయ్యా వెళ్ళూ…

బ్రిటిశ్ వారి పరిపాలన నుంచి సీమాంధ్ర నాయకులు కపట తెలివి తేటల్ని బాగా నేర్చుకున్నారు. వాటినే తమ కవచాలుగా ఇన్నాళ్ళూ మార్చుకుని తెలంగానా ప్రాంతాన్ని మరియు ప్రజల్ని మభ్యపెట్టి మరీ పాలించారు.

ఆనాడు మద్రాసు మాది, మేము అభివ్రుద్ది చేసాము కాబట్టి మాకే కావాలి అని అన్నారు ఆంధ్రా నాయకులు. లేదుపో అని తంతే వచ్చి మా తెలంగాన హైదరాబాదులొ వచ్చి పడ్డారు. అమాయకులైన తెలంగాన ప్రజలను మాయ చెసి సీమ, ఆంధ్ర మరియు తెలంగానలను కలిపిన ప్రాంతానికి “ఆంధ్ర ప్రదేశ్” అని మీ బ్రాండ్ పేరు పెట్టుకుని తెలంగాన మరియు హైదరాబాదు యొక్క అసలు చరిత్రని మరుగున పడేసారు. మీ చాతుర్యంతొ తెలంగాన ప్రజలను వెనక్కి నెట్టేసి వారికి బానిస బ్రతుకులే  మిగిల్చారు.
బ్రిటిష్ వారు తెలంగానను ఎన్నడూ కూడా పరిపాలించలేదు,కానీ మిమ్ములను మాత్రం పరిపాలించారు. బ్రిటిష్ వారి నుంచి చాలా విద్యలే నేర్చుకున్నారు మీరు. మమ్మల్ని మా మానాన వదలండయ్యా  బాబూ అని దగా పడ్డ తెలంగాన ప్రజలు ఒక ప్రక్క అంటుంటే “నువ్వంటే నాకిష్టం” “నువ్వే కావాలి” “నువ్వు లేక నేను లేను -నేను లేక నువ్వు లేవు” “జన్మ జన్మల బంధం మనది” “మనసంతా నువ్వే” అంటూ సొల్లు కబుర్లతో తెలంగాన వారిపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారు.
కాదంటే ఒక హైదరాబాదు మాకు ఫ్రీగా ఇచ్చేయండి (తెలంగానాకే ఒక గుండెకాయ వంటి  హైదరాబాదును) మీ మిగతా తెలంగాన ప్రాంతం  మరియు అక్కడి ప్రజలు మాకిక అక్కర లేదు అంటారా.
నిజాం సైనికుల కళ్ళలో కారం కొట్టి నెగ్గుకొచ్చిన తెలంగాన ప్రజలకు మీరు వల్లంతా మంట పెడుతూ వారి కాళ్ళ కింద నిప్పులు పెడుతున్నారు కదయ్యా. వెళ్ళవయ్యా వెళ్ళూ.
by కేసిరెడ్డి శ్రీధర్

You might be interested in :