Tribute to T-Martyrs : సావొద్ధు తమ్మి, నువ్వు సావొద్ధు కొడుకా by Yugandar Chittalooru

సావొద్ధు తమ్మి, నువ్వు సావొద్ధు కొడుకా
నీ అయ్యమ్మల గోస పెట్టి
నీ తోబుట్టుల గోస పెట్టి
నువ్వు తపించిన తెలంగాణకి గోస పెట్టి
సావొద్ధు తమ్మి, నువ్వు సావొద్ధు కొడుకా

యాబై రెండు సన్దె మన సంపుడు మొదలాయా
ఈ అరవై ఏండ్లలో ఎన్దెరెన్దొరొ సచిపాయె
కాసైన, రోషైనా,బాబైన, గీబైన
మనని సమ్పుక తినడంలో భేదమంటే లేనే లేదు
ఇంకీ సచుడు మనకొద్దు ఇక సంపుడు మొదలుపెట్టు
సావొద్ధు తమ్మి, నువ్వు సావొద్ధు కొడుకా

మన భూములు థస్కరిన్చి, మన నీళ్ళని మింగేసి
మన కొలువులూ చోరీ చేసి, మన బతుకులు చిదిమేసి
విశపు నవ్వుల పాలకులు ఈ చోద్యం చూస్తుంటే
ఇంకీ సచుడు మనకొద్దు ఇక సంపుడు మొదలుపెట్టు
సావొద్ధు తమ్మి, నువ్వు సావొద్ధు కొడుకా

సర్‌ఫేఖాస్ సుతం మింగి, హుస్సైన్ సాగర్ అసలు మింగి
చందనాలు, బొమ్మనాలు,జయభేర్లు,GMRలు
వక్ఫ్ లేదు గిక్ఫ్ లేదు, ఊరు లేదు, గీరు లేదు
మనం తలిస్థె అంతా మనదే అంటున్న లగడపాటి, రామోజీలనీ
వెంటబడి, తరిమికొట్టి తెలంగాణా తెచ్చుకోక
ఇంకీ సచుడు మనకొద్దు ఇక సంపుడు మొదలుపెట్టు
సావొద్ధు తమ్మి, నువ్వు సావొద్ధు కొడుకా

అణచివేత, దోపిడీలు నిత్యం మన చుట్టూ
అయినా కస్సున లేచే మన రోషం, మన త్యాగం
మన తాతలు, మన తండ్రులు ఆస్తులేమీ పంచీండ్రోగానీ
ఉద్యమాల వారసత్వం, రక్త తర్పణ అమరత్వం పుష్కలంగా పన్చిరు
జై తెలంగాణా నినదించి మంటల్లో కాలిపోయిన మన శ్రీకాంత్, మన వేణు
పేల్చుకొన్న కిష్టయ్య, ఉరెక్కిన జీవులెన్నో, రైళ్లకి ఎదురెల్లి చిద్రమైన అమరులెందరో
ఇంకీ సచుడు మనకొద్దు ఇక సంపుడు మొదలుపెట్టు
సావొద్ధు తమ్మి, నువ్వు సావొద్ధు కొడుకా

మనమిట్లా సస్తుంటే సమైక్య గొయ్యి తీసి
మన బొంద పెడుతున్నకావూరిలు, రాయపాటి లు, TSRలు, TJVలు, ఉన్దవల్లీలు ఇంకెందరో రాబంధులు
సిగ్గు లేక, శరం లేక, కనీసం మనుశలనే స్పృహ లేక
సంక నాకె దానంలు,ముకేష్లు, తలసానీలు మనకు ఢోకా చేస్తుంటే
ఉరికించి, భగాయిన్చి, డొక్క చించి డోలు కట్టి తెలంగాణా తెచ్చుకోక
ఇంకీ సచుడు మనకొద్దు ఇక సంపుడు మొదలుపెట్టు
సావొద్ధు తమ్మి, నువ్వు సావొద్ధు కొడుకా

మన విధ్యార్థులు గర్జించిరి, మన ఉద్యోగులు తెగించిరి
మన పల్లెలు ఉరుకులేసే, మన బతుకమ్మ రోడ్డెక్కే
మన రక్తం ఒక్క తాయే, మన ఆత్మలు ఒక్కట్టాఏ
మన బాట పోరు బాట, మన పాట ధూమ్ ధాం
మన లక్ష్యం తెలంగాణా, మన ధ్యేయం తెలంగాణా
పట్టుపట్టి , జుట్టు పట్టి తెచ్చుకోనే తెలంగాణా

ఐన ఒక్కమాట
మన సావుల బలంపై బేరమాదే నాయకులు
69ల ఉన్నారు, ఇప్పటికీ ఉన్నరు
ఇసన్తొల్ల చెమ్ద తీసి తెలంగాణా తెచ్చుకోక

ఇంకీ సచుడు మనకొద్దు ఇక సంపుడు మొదలుపెట్టు
సావొద్ధు తమ్మి, నువ్వు సావొద్ధు కొడుకా
నీ అయ్యమ్మల గోస పెట్టి
నీ తోబుట్టుల గోస పెట్టి
నువ్వు తపించిన తెలంగాణకి గోస పెట్టి
సావొద్ధు తమ్మి, నువ్వు సావొద్ధు కొడుకా
(దాదాపు 200 లకు చేరుకొన్న తెలంగాణా అమరులకు అశ్రు నయనాలతో)

By

Bala Yugandar Chittalooru

You might be interested in :