కాంగ్రెస్ కోతులకి పెట్టాలె వాతలు!!! by Shashi Kiran Deshetti
మా ఒట్లతోని గద్దెనెక్కి
కోట్లు, కోట్లు తెగ మెక్కి
మా గోసలు అప్పుడె మరచినారా
సిగ్గులేని కాంగ్రెస్ నాయకులారా
చీమ మెదడు కూడా చిన్నబోయే తెలివి
జాన రెడ్డికి మాత్రమె సొంతమట సి.ఎం పదవి
కెకె, విహెచ్, డిఎస్ డూడూ బసవన్నల తీరు
హైకమాండె వేదమట, ప్రజల తీర్పు బేఖాతరు
కృష్ణ కమిటి ముష్టి నియమాలు
కనిపిస్తలేవ మీ కళ్లకి కపట వేషాలు ?
కోసిన కాడికి సాలిగ తీస్మార్ఖాన్ కోతలు
పదవులకి వెంటనె చెయ్యాలె రాజీనామాలు
ప్రాంతం వాడె మమ్ముల మోసం చేస్తె
ఒట్లడుక్కొని నోట్ల మట్టి కొడ్తె
గుండ్లు గీయించి ఊరంత ఊరేగిస్తం
ప్రాణాలతోనె మిమ్ముల పాతర వేస్తం
-శశికిరణ్ దేశెట్టి
Source : YuvaTelangana
