భగ్నంకాకతప్పని సరిహద్దుప్రేమ by Devaki Tirunagari
నిజంగానే నన్ను గాఢంగా ఫ్రేమించావనుకున్నా
నీ పెదాలు వొలికిస్తున్న ప్రతి అక్షరంలో అమృతముందనిభ్రమించా
నేనూ నీ చుట్టు కలల్ని అలలఅంచెలుగా పేర్చుకున్నాను
నిజమే నిన్ను నేను ఏనాడు అడగలేదు
ఏక్కడినుంచి వచ్చావని?
అయినా ఏమిటా ప్రశ్న?
అవసరంలొ ఆదుకోవడం మానవత్వమని భావించిన వాడిని
హృదయంలో చోటివ్వడమేకాదు హృదయసఖిగా పదిలపరచుకున్నాను
కాని ఒక్కసారి జరిగిందేమిటో సింహావలోకనం చేసుకో
ఈ ఐదున్నర దశాబ్ధుల కాలంలో ఏనాడైనా దసరాను గౌరవించావా?
నీవు మనకుగా కన్నపిల్లలకు బతుకమ్మపై అసహ్యాన్నిపెంచి
వరలక్ష్మీ వ్రతాలు చేయించావు అష్టలక్ష్మీ పూజలనలవాటు చేశావు
పుట్టింటినుండే పురోహితులను పిలిపించి గోమాతలతో గృహప్రవేశాలు చేయించావు
నా తమ్ముళ్ళకు చెల్లెండ్లకు రావలసిన ఉద్యోగాలను
నీ చెల్లెళ్ళతొ తమ్ముళ్ళతొ కబ్జా చేయించావు.
నాకు మాట్లాడడం రాదని
వంటింటి ఘుమఘుమలు తెలియవని
అవకాశం చూసుకుని మరీ
నా భాషను యాసను సంస్కృతిని అవమానించావు.
అయినా జీవితసాహచర్యంలో సంయమనం తప్పదని
నిబధ్ధతల ఆదర్శంలో పయనిస్తూనే వచ్చా
కానీ నీవేమో నావాళ్ళందరినీ
నా ఇంట్లొనే పరాయివాళ్ళను చేస్తివి
బుక్కెడు బువ్వ గుక్కెడు నీళ్ళివ్వక
నన్ను కనిపెంచిన వాళ్ళను గడ్డిపరకకన్నా హీనంగా విసిరేస్తివి
నీవెప్పుడూ నిటారుగా నీ పుట్టింటి పక్షపాతివే
నీవింతగా బరితెగిస్తుంటే
నా అత్మగౌరవాన్ని ఫణంగా పెడుతూ
నన్ను నేను నీకు బానిసగా మలచుకుంటూ ఇంకెన్నాళ్ళు?
అర్గీజ్ నహీ
ఎవరిబతుకులు వారివంటున్నానే తప్ప
నీకారు అద్దాలు పగులగొట్టొదని
అనుమానాలు ఆవేశాలు ఆక్రోశాలతో ఆత్మహత్యలు తగవని
పదే పదే చెప్తూనే వున్నాను
నీ దుర్మార్గానికి ఫులిస్టాపు లేనపుడు
భార్యాభర్తలుగా మనుగడసాగించలేనపుడు
స్నేహితులుగానే విడిపొదాం.
By
తిరునగరి దేవకీదేవి
MIG- 2, APHB Colony,
Alampally road, Vikarabad.
18-01-01 ఆంధ్రజ్యోతి ‘వివిధ’లో ‘సరిహద్దుప్రేమ’కు స్పందనగా

telanganaraj
Mar 11, 2010 @ 14:57:11
great anna.
ne padasahithyanaiki na udyamabivandanalu..
jai telangana..
puretelanganite
Apr 19, 2010 @ 15:31:31
awsome good keep it up