In the Loving Memory of My Brave Brothers – by Syed AbdulMuqtadir

జై తెలంగాణ నినాదంతొ ధరిత్రి దద్దరిల్లింది

జిత్తుల మారి నాయకుల గుండె గుభేల్ మన్నది

నవ రాష్ట్రొద్యమానికి పునాది వేసిన మగధీరులకు

జొహార్లు జొహార్లు తెలంగాణ అమర వీరులకు ఇవే మా జొహార్లు

కన్న తల్లి కోసం ఉద్యమించిన సాహసులకు జొహార్లు

ఎన్నొ దీక్షలు ఇంకెన్నెన్నొ ఉద్యమాలు చెసిన ధీరులను

కొనలేక,లొంగ దీసె దారి లేక, మభ్య పెట్టె మార్గం లేక

ఆశ చూపి నమ్మించి మృత్యు వాత పెట్టింది ప్రభుత్వం

అన్ని ఆఫర్లు కాలదన్ని తెలంగాణకు సై అన్నరు

ప్రాణాలిచ్చారు కాని ఆశయాన్ని వదల లేదు

జొహార్లు జొహార్లు తెలంగాణ అమర వీరులకు ఇవే మా జొహార్లు

నా హక్కులు దొచుకున్నోన్ని నేనొదిలి పెట్టను – అరేయి 

మందీ మార్బలంతొ వచ్చి నన్ను బెదిరింప జూడకు

నేనొక్క కీకేస్తినంటె గుండె పలిగి సస్తవు

ప్రాణాలిచ్చీతందుకు మేమెప్పుడయినా సిధ్ధమే

నీ నెత్తుటి దాహం తీర్చనికి మేమంతా సిద్ధమె

తెలంగాణ సాధనకు శవాలె మెట్లయితె

మా నెత్తురుతో నీ దాహార్తి తీరుతుందంటె

కాల్చరా ముందు నన్ను, ఒక్క మెట్టు పెరుగుతుంది

నా తెలంగాణ ఒక్క మెట్టు నా వాళ్ళకు  దగ్గరవుతది

జొహార్లు జొహార్లు తెలంగాణ అమర వీరులకు ఇవే మా జొహార్లు

కన్న భూమి పునరుధ్ధరణకు రక్త తర్పణమే ముఖ్యమైతె

నా ప్రతి రక్తపు బొట్టు నా తల్లి కోసం ఇలాగె చిందిస్తాను

అమ్మా నీ కొసం నా ప్రాణమె బలి హారం

తల్లి తెలంగాణ నీ కోసం అన్ని ఒదులుకుంటాము

ఇదే నా ప్రమాణం, ఇదే మా ప్రమాణం

నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళూ ఎందరో అమరజీవులు

వాళ్ళందరి సాక్షిగా నీకు స్వతంత్రం తెప్పిస్తాం

అమ్మా తెలంగాణా నీకు స్వతంత్రం తెప్పిస్తాం

జొహార్లు జొహార్లు తెలంగాణ అమర వీరులకు ఇవే మా జొహార్లు 

జై తెలంగాణ , జై జై తెలంగాణ

You might be interested in :