Misleading Reports to SKC – By Syed AbdulMuqtadir

ఎన్నాళ్ళు? ఇంకెన్నాళ్ళు? నా తెలంగాణ తల్లికి సంకెళ్ళు?
భ్రమకేమొ పూజలు (తెలుగు తల్లి), నా తల్లి తో ఎందుకురా ఇంత కుళ్ళు?
ఎందరో వచ్చారు ఏదేదో చెప్పారు ఇప్పటికీ అదే వరస
ఎవరెవరో వస్తున్రు ఏదేదో చెప్తున్రు, మిగిలింది మాత్రం ఒక్కటే “ఆశ”
ఏజెన్సీలను హైర్ చేసి నానా హైరానా పడి
దొంగలు డేటాలు జమ జేస్తున్రు
వేల కొద్ది కాగితాలు శ్రీ కృష్ణ సమర్పయామి
వందల కొద్ది సీడీలు శ్రీ కృష్ణ సమర్పయామి
కోట్ల కొద్ది అబద్ధాలు శ్రీ కృష్ణ సమర్పయామి
చరిత్రలోని “తథ్యాలు” శ్రీ కృష్ణ సమర్పయామి
దొంగలెక్కల ఖాతాలు శ్రీ కృష్ణ సమర్పయామి
తప్పుడు అభివృద్ధి నిజాలు శ్రీ కృష్ణ సమర్పయామి
ఇర్రిగేషన్ దొంగ లెక్కలు శ్రీ కృష్ణ సమర్పయామి
అంతా సవ్యంగానే జరిగిందని రిపోర్టులు శ్రీ కృష్ణ సమర్పయామి
మేమే నష్ట పోయామన్న బూటకాలు శ్రీ కృష్ణ సమర్పయామి
యుగ యుగాలుగా మేమంతా ఒక్కటే మాకు వేర్పాటు వద్దు
కేవలం 14 మంది మాత్రమే వేర్పాటుకు సప్పోర్టు
11 ఎం ఎల్ ఏలు ఇద్దరు ఎం పీ లు 1 ప్రొఫెసరు
వీళ్ళకు తప్ప ఇంకెవ్వరికీ వద్దు వేర్పాటు
లంకను రక్షించడానికి రావణుడు చేసినన్ని ఎత్తుగడలు
ల్యాంకోల కొరకు లగడపాటి లాంటోళ్ళ ఎత్తులూ జిత్తులూ
ఎన్నో ల్యాంకోలు మరెందరో లగడపాటీలు అందరికీ పెడతాము తద్దినాలు
మాకయితే సర్వం శ్రీ కృష్ణ సమర్పయామి సర్వస్వం శ్రీ కృష్ణ సమర్పయామి
శ్రీ కృష్ణుడు ‘రాయంచ లాగా పాలు త్రాగి నీళ్ళొదిలెస్తాడు
ఇది చిఱు సత్యం, దొంగలవుతున్నారు అప్రమత్తం
డబ్బంతా మూట గట్టి దాటుతున్నారు శ్రీ కాకుళం
కృష్ణుడే చెర విడిపిస్తాడు తెలంగాణ తల్లికి
శ్రీ కృష్ణుడే విముక్తి కలిగిస్తాడు
ఎన్నాళ్ళు? ఇంకెన్నాళ్ళు? నా తెలంగాణ తల్లికి సంకెళ్ళు?

You might be interested in :