నా జీవనం తెలంగాణకు పునరంకితం – By Syed AbdulMuqtadir

జాగోరె జాగోరె జాగోరె జాగో తెలంగాణ వాలో జాగో

కన్న తల్ల్లిని విడిపించ కలిసి పోరాడుదాం చలో చలో 

సంస్కృతిని రక్షించ కలిసి ఉద్యమిద్దాం చలొ చలొ

జాతీ, ధర్మం మతం మనకు అన్నీ తెలంగాణాయే

కులం గోత్రం అన్ని వొదిలి కలిసి కట్టుగా చలొ చలొ

మన బతుకులు తెలంగాణకు పునరంకితం చేద్దాం చలొ చలొ 

జాగోరె జాగోరె జాగోరె జాగో తెలంగాణ వాలొ జాగో

రాష్ట్ర పునాదులు కదిలినయి ఇగ ఢిల్లీని కదిలించాలె  

ఢిల్లీ ఒక్క ఊపు ఊగింది, మల్ల ఆగి పోయింది 

కేంద్ర సర్కారు నిద్ర మత్తు వీడాలంటె 

మన్మొహను సోనియల చెవుడు పోవాలంటె

ఆంధ్రోని ఎత్తులకు పైయెత్తులు వెయ్యాలంటే

మనకున్న ఐక్యతను చాటి చూపాలంతె 

జై తెలంగాణ నినాదంతొ ఢిల్లీ కోట పలగాలంతే, అందుకే…

జాగోరె జాగోరె జాగోరె జాగో తెలంగాణ వాలొ జాగో

కన్న తల్ల్లిని విడిపించ కలిసి పోరాడుదాం చలొ చలొ

You might be interested in :