హతవిధీ – నా స్వాతంత్ర్యం ఆరేండ్లకే నశించె

ఆంధ్రోని రాజకీయ చదరంగంలో
నెహ్రు కదిలించిన తెలుగు భాష పావులతో
సీమాంధ్రుల నక్క జిత్తుల ఆహ్వానంతో
దొంగలు రాసిన పెద్దమనుషుల ఒప్పందంతో

త్రిలింగుడి స్వపరిపాలనా ఆశ, ఆశగానే మిగిలిపాయె
ప్రాణాలోడి తెచ్చుకున్న స్వాతంత్ర్యం   
ఆరేండ్లకే తిరిగి నశించెనే
నెహ్రు మాటలు నమ్మినందుకు
పెద్ద మనుసులను ఒప్పుకున్నందుకు
స్వపరిపాలన మృగతృష్ణాయె
పెద్దోల్ల ఒప్పందం త్రిలింగానికి మహా శాపమాయె
విశాలాంధ్ర మా పాలిట మృత్యువు ఫర్మానాయె

ఫ్యాక్టరీలన్ని మూసుక పాయె
ఉద్యోగాలు ఊడి పాయె; మంచి లీల్లు గతి లెవ్వాయె
ఏండ్లకొద్ది కష్టపడి సాగర్ డం కట్టుకుంటె
ఆంధ్రోడు ఆట విడుపు లెక్క నీల్లెత్తుకు పాయె

నీలం సంజీవ మాకు హాలహాలమిచ్చె
ఆంధ్రాకు కెనాల్ నీల్లు, మాకేమొ యాతాలిచ్చె
నడి ఝాము రాత్రికి మోటలు మేము కొడితె
కాలువల సాగుతో ఆంధ్రోడు బలిసి పోయె

ఆంధ్రోని జిత్తులింక సాగనివ్వొద్దంటె
తెలంగాణ వచ్చె దాక ఉద్యమం ఆగొద్దు
సర్కారు వాగ్ధానాలు అస్సలు నమ్మొద్దు
తెలంగాణ కంటె తక్కువ ఏమీ ఒప్పొద్దు
సర్కారు నింక నిద్ర పోనియ్యొద్దు
వాల్ల బతుకులల్ల పొద్దు పొడవనియ్యొద్దు

ఉద్వేగం కాదు, యుక్తితో మెలగాలె
మన సన్నాహం చూసి ఆంధ్రోడు
వర్షంల గూడ చెమటలు కక్కాలె
జై తెలంగాణ నినాదంతో ముందుకు సాగాలె
మన నినాదం ఆంధ్రోనికి గుండె పోటు కావాలె

You might be interested in :