Nizamabad Voter to DS

రాక రాకొచ్చినవు లీడరా, శాన రోజులకొచ్చినవు లీడరా

మమ్మల్నెట్ల యాద్ జేషినవు లీడరా, మాతోనేం పని బడ్డది లీడరా?

రంగు కొంచెం తెలుపయింది లీడరా , బొర్ర గూడ పెరిగింది లీడరా

బండ్లెకేలి దిగకు నువ్వు లీడరా, మాట్లాడితే బుసలు కొడ్తున్నవు లీడరా

నడుస్తె ఏమయితదో మరి లీడరా, బండ్లెకేలి దిగకు నువ్వు లీడరా

రాక రాకొచ్చినవు లీడరా , శాన రోజులకొచ్చినవు లీడరా

నువ్వు కొబ్బరి కాయ గొట్టిన కాలనీ లీడరా ఎప్పుడో కొట్టుక పోయింది లీడరా

నువ్వు పట్టాలిత్తనన్న బూమి లీడరా పత్తా లెకుంట బోయింది లీడరా

నువ్వు యెత్తనన్న బొరు ఇంక బడలేదు లీడరా

మేము మా గోదలూ లీడరా కుంట్ల లీల్లే తాగుతున్నం లీడరా

రోడ్లేత్తమని కోపులయితె తవ్విన్రు లీడరా , మరి మట్టేమో నీ దొడ్లె బొషిన్రు లీడరా

రాక రాకొచ్చినవు లీడరా, శాన రోజులకొచ్చినవు లీడరా

తెలంగాణ తెత్తనంటివి లీడరా తల్లితోడు అవ్వతోడంటివి లీడరా

వొట్టిగనే ఎందుకు తింపుకుంటవు లీడరా నేనే ఇత్త నేనే తెత్త అంటవు గని

లీడరా గట్టిగెందుకు మాట్లాడవు లీడరా పదేండ్ల నుంచి గిదే మాట లీడరా

కొడుకును మేయర్ను జేత్తివి లీడరా నీ కుర్చీ దక్కక పాయె లీడరా

మా ముంగటి పోరడని లీడరా నీ కొడుకునయితే గెలిపించినం లీడరా

నువ్వు దొంగ చేష్టలు మానుకో లీడరా ఒక్కసారి ఓడగొట్టినం లీడరా

నీ జమానతు ఈ సారి లీడరా గోదాట్లె ముంచుతమూ లీడరా

రాక రాకొచ్చినవు లీడరా శాన రోజులకొచ్చినవు లీడరా

మమ్మల్నెట్ల యాద్ జేషినవు లీడరా మాతోనేం పని బడ్డది లీడరా?

You might be interested in :