వరంగల్ లో శ్రీకాంత చారి తల్లి ప్రచారం

ఉప ఎన్నికల్లో 12 అసెంబ్లి నియోజక వర్గాలలో రాజీ నామాలు చేసిన అబ్యర్తుల గెలుపు కోసం ప్రచారం చేస్తా
వై.ఎస్ మరణాంతరం  జరిగిన చావులకు తెలంగాణ బలిదాణాలకు చాలా వ్యత్యాసం

అమరుల   త్యాగాలు వృదా పోవు – తెలంగాణ వచ్చే వరకు కొడుకు ఆశయాల కోసం పనిచేస్తా
వరంగల్ ప్రచారంలో శ్రీకాంత చారి తల్లి కాసోజు శంకరమ్మ

తెలంగాణ రాష్ట్రం కోరుతూ విద్యార్థులు, యువకులు చేసిన బలిదాణాలకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణాంతరం జరిగిన మరణాలకు చాలా వ్యత్యాసం ఉందని రెండింటిని ఒక్కటిగా చూడటం ఏ మాత్రం సరికాదని శ్రీకాంత చారి తల్లి కాసోజు శంకరమ్మ అన్నారు. వై.ఎస్ మరణం తర్వాత జరిగినవి మరణాలని కాని తెలంగాణ కోసం జరిగినవి బలిదాణాలని ఆమె పేర్కొన్నారు. వందలాది మంది విద్యార్థులు, యువకులు తెలంగాణా కోసం తృణ ప్రాయంగా ప్రామాలు అర్పించారని గుర్తు చేశారు. వై.ఎస్ మరణ అనంతరం జరిగిన చావులకు తెలాంగాణ బలిధాణాలకు ముడి పెట్టడం ఎంత మాత్రం సహించ లేని విషయమని అన్నారు.

వరంగల్ వెస్ట్ అసెంబ్లి నియోజక వర్గంలో పోటి చేస్తున్న తెరాస అభ్యర్థి దాస్యం వినయ్ బాస్కర్ ఎన్నికల ప్రచారంలో శంకరమ్మ ఆమె భర్త కోసోజు వెంకటచారి.కుమారుడు రవిందర్ తో కల్సి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారానికి ముందు ఆమె హన్మకొండ లోని సుబేదారి లోని  తెలంగాణ అమర వీరుల స్థూపం దగ్గర   నివాళులు అర్పించారు. ఎన్నికల  ప్రచారంలో పాల్గొంటూనే  శంకరమ్మ మద్య మద్యలో మీడియా ప్రతినిధులతో  మాట్లాడారు.

కాకతీయకాలని. పెద్దమ్మ గడ్డ, కాపు వాడ లో శంకరమ్మ ఇంటింటికి తిరిగి తెరాస అబ్యర్థి వినయ్ బాస్కర్ నుఅత్యదిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. శంకరమ్మ తన కుమారున్ని గుర్తు చేసుకుంటూ తన కొడకునుతలుచుకుంటూ కన్నీరు పెట్టు కోవడం చూసిన మహిళలు కూడ క్ననీరు పెట్టు కున్నారు.

డాక్టర్ కావాల్సిన తన కొడుకు మూడు సంవత్సరాలుగా  తెలంగాణ కోసం తపించాడని తన కొడుకు త్యాగం వృధాగా పోదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెంలగాణ  యువకుల ముఖాలలో చిరునవ్వులు చూడాలని ఉందని అప్పటి వరకు తన కొడుకు అశయాల కోసం పనిచేస్తానని శంకరమ్మ భావోద్వేగంతో అన్నారు.

తెలంగాణ ఉప ఎన్నికలలో 12 అసెంబ్లి నియోజక వర్గాలలో రాజీ నామాలు చేసి తిరిగి పోటి చేస్తున్నతెలాంగాణ వారి గెలుపు కోసం ప్రచారం చేస్తానని అన్నారు. పిసిసి చైర్మన్ డి శ్రినివాస్ పోటి చేస్తున్న నిజామాబాద్ అసెంబ్లి నియోజక వర్గంలో కూడ భారతీయ జనతా పార్టి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం సాగిస్తానని అన్నారు.

కాంగ్రేస్,తెలుగుదేశం పార్టీల పార్లమెంట్ సబ్యులు,  ఎమ్మెల్యేలు పదవులకు రాజీ నామాలు చేసి ఉంటే  తెలంగాణ వచ్చేదని పదవులకు రాజీ నామాలు చేయకుండా రాజీ నామాలు చేసిన వారిపై పోటి చేయడం వెనకాల అన్ని పార్టీల సీమాంద్ర నాయకుల కుట్ర  ఉందని శంకరమ్మ అన్నారు.  కాంగ్రేస్ పార్టి గత 50 సంవత్సరాలుగా తెలాంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిందని అన్నారు. రెండు విడతల జరిగిన ఉద్యమం నీరు గార్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు. ఈ సారి కూడ తెలంగాణ తెచ్చేది ఇచ్చేది మేమే నంటూ తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని తెలాంగాణ ప్రజలు మోస పోవద్దని కోరారు. ప్రాణాలు బలిదాణాలు చేసిన  విద్యార్థుల సాక్షిగా ప్రమాణాలు చేసిన తెలుగుదేశం పార్టి నాయకులకు కూడ పదవులు కావల్సి వచ్చాయని అన్నారు ఉప ఎన్నికల్లో ఒక్క సీటి తెలంగాణ రాష్ట్ర సమితి కో ల్పోయినా తెలంగాణ వాదం లేదని టిడిపి అద్యక్షులు చంద్రబాబు  సహా కాంగ్రేస్ నాయకులు దుష్ప్రచారం చేస్తారని హెచ్చరించారు.

ఎన్నికల ప్రచారంలో తెరాసఅబ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ పార్లెమంట్ సబ్యులు బి వినోద్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

వరంగల్ న్యూస్. తెలంగాణ జర్నలిస్టు ఫోరం

You might be interested in :