స్సూడ సక్కనివాడు ఆ చందురూడు. స్సూడాలేని వాడు మా చందురూడు

స్సూడ సక్కనివాడు ఆ చందురూడు
స్సూడాలేని వాడు మా చందురూడు

మచ్చ లేనివాడు ఆ చందురూడు
తనువంత మచ్చలున్న మా చందురూడు

చీకటిని తరిమే వాడు ఆ చందురూడు
చీకట్లో తరిమే వాడు మా చందురూడు

చల్లాని వెన్నాలిచ్చు ఆ చందురూడు
వెన్నెల్లో చల్ల దోచు మా చందురూడు

పాపలకు ఆటబొమ్మ ఆ చందురూడు
మా జన్మలతో ఆటలాడు మా చందురూడు

పున్నమ్మిలో పురిని విప్పు ఆ చందురూడు
పాపంనే పున్నమానే మా చందురూడు

ఆమసనాగామాయే ఆ చందురూడు
మా యాసనాగాముచేసే మా చందురూడు

అందరికి మేనమామ ఆ చందురూడు
మామకే సున్నం పెట్టు మా చందురూడు

అందరికి జాబిల్లి ఆ చందురూడు
గోడ మీది పిల్లి మా చందురూడు

రెండేసి కన్నుల వాడు మా చందురూడు
ఒక్క కన్ను కాన రాదు మా చందురూడు

కెరట్టాన్నిఉప్పెన చేసే ఆ చందురూడు
ఉప్పేనని అలగా మార్చే మా చందురూడు

పోలవరం పోడు మా చందురూడు
బాబ్లిలో బందులు చేసే మా చందురూడు

Thanks Vinod Kumar Mandhala for sharing

You might be interested in :