Telangana By Polls And The Opinion Poll

సంబరాలో యన్న సంబరాలు

తెలంగాణ పల్లెల్లొ సంబరాలు

వోటరు తీర్పు వచ్చింది

కాంగ్రేసోనికి మూడింది

టి డి పి కాలం చెల్లింది

తెలంగాణ జెండా పైకెగసింది

కుక్క కాటుకు చెప్పు దెబ్బ

చాలా పాత నానుడి

తెలంగాణ ద్రోహులకు వోటరు దెబ్బ

ఇది నాయకులకు ఇప్పుడే తెలిసింది

త్యాగధనుల రాజినామా

ఎనలేని కీర్తి తెచ్చింది

రాబోయె సార్వత్రిక ఎన్నికల్తో

తెలంగాణ ఉద్యమ పర్వం ముగుస్తుంది

ఆంధ్రోని గుండెల్లో దడ దడ

పార్టీల అంచనాలు గడబిడ 

సంబరాలో యన్న సంబరాలు

తెలంగాణ పల్లెల్లొ సంబరాలు

కాంగ్రేసులో కుమ్ములాటలు

లగడపాటి పై రుస రుసలు

ఒకరి పై ఒకరి అభాండాలు

జగనుంటె వచ్చేవి ఇంకొన్ని వోట్లు

ఆంధ్రోనికింక బుద్ధి రాలేదు

వోటరన్న చెప్పిండు గుణపాఠము

ముంజేతి కంకణానికి అద్దాలు

పైసలిచ్చి లగడపాటి సర్వేలు

మా మనసులు తెలుసుకునేందుకు

ఎందుకురా పడ్తారు ఇన్ని పాట్లు? 

మాకెప్పుడో తెలుసు మావారి విజయాలు

అరవయ్యేళ్ళుగా అడుగుతున్నాము

న్యాయం చెయ్యమని చెబుతున్నాము

జై తెలంగాణ జై తెలంగాణ అంటున్నాము 

బజాయించి మరీ ఢంకాలు

ద్రోహులను వొల్లమని చెప్పినాము

గెలిపించమని కాళ్ళా వేళ్ళా పడ్డారు

ఏమేమొ చెప్పిన్రు కాకమ్మ కథలు

అందరినీ తరిమి తరిమి కొట్టినాము

మరి నిజామాబాదుల ….

తానొవ్వక ఒకరిని నొవ్వింపక

ముఖం చాటెసిన్రు ముస్లింలు

అది ఒడిసెల దెబ్బ ముసలి కాంగ్రేసుకు

పెద్దల పండుగనాడు ముస్లింలు

ఖననం జేసిన్రు కాంగ్రేసును

దీపాలు వెలిగించి పండుగ జరిపిన్రు

సంబరాలో యన్న సంబరాలు

తెలంగాణ పల్లెల్లొ సంబరాలు

You might be interested in :